Header Banner

జగన్‌ను కోర్టుకు రప్పిస్తా! అప్పటి వరకు నిద్రపోను!

  Wed May 21, 2025 19:40        Politics

విశాఖ నివాసి న్యాయవాది అబ్దుల్ సలీం మాజీ సీఎం జగన్‌ను కోడి కత్తి, గులకరాయి కేసులలో కోర్టుకు హాజరు కావాలని తీవ్రంగా కోరుతున్నారు. జగన్‌ ఇప్పటి వరకు విచారణలో వాంగ్మూలం ఇవ్వకపోవడంతో కేసులు వేగంగా పరిష్కరించాలని ఆయన హెచ్చరించారు.

 

కోడి కత్తి, గులకరాయి కేసులలో మాజీ సీఎం జగన్‌ను కోర్టుకు రప్పించి తీరుతానని విశాఖపట్నానికి చెందిన న్యాయవాది అబ్దుల్‌ సలీం అన్నారు. అప్పటి వరకు నిద్రపోనని వ్యాఖ్యానించారు. క్రైమ్‌ నంబర్‌ 122/24గా నమోదైన అనిష్‌ కుమార్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ బెంగాల్‌ బాండ్ల కేసు విషయమై మంగళవారం ఆయన అనంతపురం జిల్లా రాయదుర్గం కోర్టుకు వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. కోడి కత్తి కేసులో హాజరు కావాలని 2023, ఏప్రిల్‌ 10న జగన్‌ను కోర్టు ఆదేశించిందని తెలిపారు. అయితే, ఆ కేసులో చంద్రబాబు, హర్షవర్ధన్‌ చౌదరిని తప్పించి, శీను అనే వ్యక్తిని మాత్రమే విచారించారని జగన్‌ పిటిషన్‌ దాఖలు చేశారని తెలిపారు. ఆ పిటిషన్‌ను ఎన్‌ఐఏ కోర్టు కొట్టివేసిందని, దాన్ని సవాల్‌ చేస్తూ ఆయన హైకోర్టును ఆశ్రయించారని చెప్పారు. జగన్‌ వేసిన పిటిషన్‌ కొట్టివేస్తే తప్ప కోడి కత్తి కేసు విచారణ ప్రారంభం కాదన్నారు. మాజీ సీఎం జగన్‌ కోర్టు విధివిఽధానాలను పాటించడం లేదని విమర్శించారు. కోడి కత్తి, గులకరాయి కేసులలో ఆయన ఇప్పటివరకు వాంగ్మూలం ఇవ్వలేదని తెలిపారు. జగన్‌ కోర్టుకు హాజరై సాక్ష్యం చెబితేనే వాస్తవాలు వెలుగు చూస్తాయని చెప్పారు. నేరం చేసినవారికి శిక్ష తప్పదని, నేరాలకు పాల్పడిన జార్ఖండ్‌ మాజీ సీఎం మధుకోడా జైల్లో ఉన్నారని, ఇదే విషయం జగన్‌ కేసుల్లోనూ రుజువు కాబోతోందని సలీం వ్యాఖ్యానించారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 అన్నదాత సుఖీభవ' నిధులు జమ అప్పుడే..! తాజా నిర్ణయంతో..!

 

ఏపీ ప్రజలకు అదిరిపోయే వార్త.. కొత్తగా కేబుల్ బ్రిడ్జ్! ఈ రూట్ లోనే ఫిక్స్ - ఆ నేషనల్ హైవేకు దగ్గరగా.!

 

 టీటీడీలో కీలక నియామకాలు! ఏరి కోరి.. వారి మార్గదర్శకంలోనే ఇక!

 

ఏపీలో ఆ ఉద్యోగులందరికి పండగే పండగ..! కీలక ఉత్తర్వులు జారీ!

 

నేడు (21/5) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఏపీలో రేషన్ కార్డులు ఉన్నవారికి గుడ్‌న్యూస్..! వచ్చే నెల నుంచి ఆ రూల్ రద్దు?

 

 రేషన్ పంపిణీపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం! జూన్ నుంచి ఇలా..!

 

ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ఆపరేషన్ వైసీపీ! నెక్స్ట్ వికెట్..!

 

ఈ-పాస్‌పోర్ట్ వచ్చేసింది! విదేశాంగ శాఖ కీలక నిర్ణయం!

 

వారిని అభినందించిన లోకేష్.. ఏపీలో విద్యాసంస్కరణలపై దేశ వ్యాప్తంగా..

 

ఏపీలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వారికి గుడ్‌న్యూస్..! ఒక్క క్లిక్‌తో స్టేటస్ చెక్ చేస్కోండిలా..!

 

ఎవ్వరూ మాట్లాడొద్దు..! లిక్కర్ స్కాంపై సీఎం ఆర్డర్స్!

 

ఏపీలో కొత్త నేషనల్ హైవే నాలుగు లైన్లుగా.. ఈ రూట్‌లో భూసేకరణ! ఇక 8 గంటల్లో విశాఖ!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే ఫైబర్ నెట్.. ఆ వివరాలు మీకోసం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

 


   #Andhrapravasi I will bring Jagan to court!